Site icon Swatantra Tv

యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జో బైడెన్ పోటీ

       ఈ ఏడాది అమెరికా లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేస్తారు. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ ను అందుకున్నారు. జార్జియా, మిస్సిసిపీ స్టేట్ లలో జరిగిన ప్రైమరీల్లో విజయం సాధించిన తర్వాత బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ లభించింది. మార్చి 9న అట్లాంటా లోనూ బైడెన్ కు పూర్తి మద్దతు లభించింది. నవంబర్ లో జరుగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో పోటీ పడే అవకాశం ఉంది. మంగళవారం జో బెడెన్ కు వరుసగా జార్జియా, మిస్సిసిపి , నార్త్ మరియానా ఐలాండ్ లో విజయం సాధించిం వరుసగా రెండో సారి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ పొందారు. ఆగస్టులో షికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన నామినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. డోనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి త్వం రేసులో ముందంజలో ఉన్నారు.

 

 

Exit mobile version