Site icon Swatantra Tv

పురందేశ్వరికి జనసేనాని శుభాకాంక్షలు

స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. పురందేశ్వరికి శుభాకాంక్షలు అని, కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన పురందేశ్వరి కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు సాగుతారని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ఉంది.దీంతో అధ్యక్ష బాధ్యతల నుండి సోము వీర్రాజుని తప్పించి పురందేశ్వరినీ నియమించడంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.ఒక్కసారిగా బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన కిషన్ రెడ్డికి కూడా పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను కిషన్ రెడ్డి విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

Exit mobile version