Site icon Swatantra Tv

జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్…. చిట్ చాట్

    కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టలేదని అన్నారు. చంద్రబాబు నుంచి విభేదించి..రాజకీయ ఉనికి కోసం కేసిఆర్ టీఆర్ఎస్ పెట్టాడని చెప్పారు. కేసిఆర్ తన రాజకీయం కోసం పార్టీ పెట్టాడు.. తన రాజకీయం కోసం తాను టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. 2005 లో తాను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీ లు గెలవాలని చాలా ప్రయత్నాలు చేశారని చెప్పారు.

    బీజేపీ, బీఆర్ఎస్ లు డూప్లికేట్ పార్టీలని అన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కవితని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం చేశారని తెలిపారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి ముందు కవిత అరెస్ట్ ప్రచారం కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కి లాభం అనుకుంటే కవిత అరెస్ట్ తప్పక ఉంటుందని అభిప్రాయపడ్డారు. కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉన్నట్లేనని చెప్పారు. గతంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు విలువ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు రాకుండా ప్రజల డైవెర్ట్ చేయడం కోసమే బీజేపీ ట్రిక్స్ ప్లే చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు.

Exit mobile version