Site icon Swatantra Tv

కేటీఆర్‌పై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు ఏం మాట్లాడాలో అర్థంకావడం లేదని.. పొలిటికల్ కోచింగ్ ఇప్పించాలంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్‌కు తెలియదని కామెంట్ చేశారు. దేశం కోసం రాజీవ్ గాంధీ మిలిటెంట్ల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని.. అది ఎవరూ చెరపలేని చరిత్ర అని అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం కావడం లేదని మండిపడ్డారు.. సచివాలయం ముందు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ విగ్రహాన్ని పెడితే ఇంత అక్కసు ఎందకని ప్రశ్నించారు.

 

Exit mobile version