కడప జిల్లాలో నేడు రెండవ రోజు మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ప్రజాదర్బార్‌లో భాగంగా నేడు పులివెందుల నియోజకవర్గ వాసులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. టూర్‌లో భాగంగా నిన్న ఇడుపులపాయలో పర్యటించారు జగన్. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించిన అనంతరం పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి భరోసా కల్పించాలని.. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఐక్యంగా పోరాడాలని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.