విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డానని.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు. ఈసారి జగన్2.0ని చూడబోతున్నారని అన్నారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని.. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానని చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసి చట్టం ముందు నిలబెడతానని జగన్ తెలిపారు.
విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
