Site icon Swatantra Tv

జిల్లాల బాట పట్టనున్న జగన్

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలో జిల్లాల బాట పట్టనున్నారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని సూచించారు. జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాలకు నియామకాలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు.

Exit mobile version