Site icon Swatantra Tv

14వ రోజుకు చేరుకున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

        వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రచారంలో జోరు పెంచారు. అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించి ముందున్న జగన్‌. ఎలక్షన్ క్యాంపెయిన్‌లోనూ దూసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని చుట్టేందుకు చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది.ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ రాత్రి బస చేసిన నంబూరు బైపాస్‌ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.కాజా, మంగళగిరి బైపాస్‌ మీదుగా సీకే కన్వెన్షన్‌ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొం టారు. అనంతరం కుంచనపల్లి బైపాస్‌ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకొని భోజన విరామం తీసుకుం టారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్‌సింగ్‌ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్‌ మీదుగా కేసరపల్లి బైపాస్‌ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Exit mobile version