Site icon Swatantra Tv

ప్రత్యర్థి పాల్‌ చెంప చెళ్లుమనిపించిన టైసన్‌

బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టెసన్‌ తన ప్రత్యర్థి చెంప చెళ్లుమనిపించాడు. 19 ఏళ్ల తర్వాత బౌట్‌కు సిద్ధమైన టైసన్‌.. ఆటకు ముందు బరువును కొలిచే కార్యక్రమంలో పత్యర్థి 27 ఏళ్ల పాల్‌ చెంప చెళ్లుమనించాడు టైసన్‌. వెంటనే అలర్ట్‌ అయిన భద్రత సిబ్బంది వీరిని ఆపారు. ఈ ఘటన తర్వాత మాటలు ముగిశాయని అంటూ టైసన్‌ ఆగ్రహంగా వెళ్లిపోయాడు. అయితే బరువు కొలిచే సమయంలో తన పాదంపై పాల్‌ కాలు పెట్టడంతోనే టైసన్‌ కొట్టాడని.. అక్కడే ఉన్న టైసన్‌ స్నేహితుడు టామ్‌ పాటి వెల్లడించాడు.

టైసన్‌ కొట్టిన దెబ్బతో తనకేం బాధ లేదని అన్నాడు పాల్‌. అతను కోపంతో ఉన్నాడని తెలుపుతూ అందంగా కొట్టావ్‌ మిత్రమా అంటూ స్పందించాడు. ఆ తర్వాత అతను మరణించాలని అరుస్తూ నిష్క్రమించాడు. 2005లో కెవిన్‌ చేతిలో ఓటమి తర్వాత టైసన్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ ఇన్నాళ్లకు బౌట్‌లో తలపడుతున్నాడు.

Exit mobile version