Site icon Swatantra Tv

మీడియా పాయింట్‌ను బహిష్కరించిన కేసీఆరే.. మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడారు – ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియా పాయింట్‌ను బహిష్కరించిన కేసీఆరే.. మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడారని చెప్పారు. ఇష్టం లేని పెళ్లి కొడుకు లాగా కేసీఆర్ అసెంబ్లీలో కూర్చున్నారని అన్నారు. అంకెలను చూడలేదు, చదవకుండా ఉకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని విమర్శించారు. పదేళ్లలో 11వేల కోట్లు మాత్రమే మైనార్టీలకు ఖర్చు చేశారని అన్నారు. మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version