Site icon Swatantra Tv

అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదు: కేటీఆర్‌

అల్లు అర్జున్‌ అరెస్టు తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఖండించారు. అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు అల్లుఅర్జున్‌ నేరుగా బాధ్యుడు కాదని ఆయన తెలిపారు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్‌ అరెస్టు తీరు నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్‌ కారణమయ్యారని, ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డి కూడా అరెస్టు చేయాలని కేసీఆర్ ట్వీట్ చేశారు.

Exit mobile version