సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కొడంగల్‌లో ప్రభుత్వ పాఠశాల మూతపడటం పట్ల హరీశ్‌రావు ట్వీట్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో పాఠశాల మూతపడటం సిగ్గుచేటని విమర్శించారు. టీచర్లు లేక పాఠశాల మూతపడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల పెడతామని చెప్పారన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.