Site icon Swatantra Tv

ఇజ్రాయెల్‌పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్‌

   ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు చేయడం మొదలు పెట్టింది. అర్థరాత్రి దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ ను ఇరాన్‌ ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేం దుకు తాము రెడీగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. ఇరాన్‌ నుంచి ఇరాక్‌ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌వైపు డజన్ల కొద్ది డ్రోన్‌లు ఎగురుతున్నట్లు ఇరాన్‌ తెలిపింది. వీటిల్లో కొన్నింటిని సిరియా మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ వాటి గగనతలాన్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేసింది. ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో IRGCకి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిగా అండగా ఉంటామని… దేశ భద్రతకు తాము హామీ అని బైడెన్‌ తెలిపారు.

Exit mobile version