Site icon Swatantra Tv

IPL 2023 |మొదలైన ఐపిఎల్‌ మ్యాచ్‌లు.. ఎక్కువ ఆశపడ్డారా.. ఇక అంతే..

IPL 2023  |క్రికెట్‌ అభిమానులకు పండగ మొదలైంది. ఈ ఏడాది ఐపిఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. మార్చి 31వ తేదీ శుక్రవారం నుంచి మొదలైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ దాదాపు రెండు నెలల పాటు జరగనున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిచింది. శని, ఆదివారాల్లో అయితే రోజుకు రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపిఎల్‌ మొదలైందంటే క్రికెట్‌ అభిమానులకు పండగనే చెప్పుకోవాలి. ఇదే సమయంలో బెట్టింగ్‌ రాయుళ్లకు సైతం ఐపిఎల్‌ ఒక ఫెస్టివల్‌. కాని బెట్టింగ్‌ బారిన పడి ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు చూస్తున్నాం.

IPL 2023  |ఈ ఐపిఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు గత కొనేళ్లుగా చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ లు వచ్చిన తర్వాత.. గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లకు పాల్పడి తమ జేబులు ఖాళీ చేసుకున్న తర్వాత.. డబ్బులు పోయాయంటూ బాధపడుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. కొంత మంది పరిమితంగా బెట్టింగ్‌లకు పాల్పడుతుంటే.. మరికొంతమంది ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో తమ దగ్గరున్న డబ్బులను పొగొట్టుకుంటున్నారు. మరికొంతమంది అయితే అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి, శ్రమించి సంపాదించే సంపాదనను క్షణాల్లో ఆవిరి చేసుకుంటున్నాం. సంపాదించడం చాలా కష్టం.. కష్టం విలువ తెలిసిన చాలామంది బెట్టింగ్‌ అనే వ్యసనానికి బానిసలుగా మారి లక్షల్లో నష్టపోతున్నారు.

ఎక్కువ అప్పులపాలు కావడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లను చూడటం తప్పుకాదు. చూసి మన అభిమాన జట్టు గెలిస్తే చప్పట్లు కొట్టడం తప్పుకాదు.. కాని.. ఏ జట్టు గెలుస్తాది.. ఎవరెంత స్కోర్‌ కొడతారో ముందే పసిగట్టి బెట్టింగ్‌లకు పాల్పడటం ద్వారా బంగారు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు చాలామంది. ఏ జట్టు ఎంత స్కోర్‌ చేస్తాదనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాగా ఆడే ఆటగాళ్లు సైతం ఒకోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. పిచ్‌, వాతావరణ పరిస్థితులపై ఆట ఆధారపడి ఉంటుంది. అలాంటి సమయంలో స్కోర్‌ ముందే అంచనా వేసి బెట్టింగ్‌ చేయడం ద్వారా చాలా మంది అప్పులపాలవుతున్నారు.

ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశ కారణంగా చాలా మంది ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు వ్యసనపరులుగా మారి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చట్ట ప్రకారం జూదమాడటం నేరం. బెట్టింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కితే.. డబ్బులు పొగొట్టుకోవడం పక్కన పెడితే పోలీస్‌ కేసులతో మన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నవాళ్లవుతాం. అందుకే బెట్టింగ్‌కు దూరంగా ఉంటూ.. ఐపిఎల్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేయడంతో తప్పులేదు కాని.. ఈజీ మనీ ఎర్నింగ్ కోసం బెట్టింగ్‌కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు సైకాలిజిస్టులు.

Read Also:  ఇంటర్వ్యూకి వెళ్తున్నారా.. ఇలా చేస్తే జాబ్‌ గ్యారంటీ..

Follow us on:  YoutubeInstagramGoogle News

Exit mobile version