Site icon Swatantra Tv

IPL 2023 On JioCinema | ఐపీఎల్ మ్యాచ్ లు ఫ్రీ… ఓటీటీపైకి రానున్న‘జియో’

IPL 2023 On JioCinema

IPL 2023 On JioCinema | మార్కెట్ గురూ… ముఖేష్ అంబానీ ఏం చేసినా సంచలనమే. తాను ఏ రంగంలోకి దిగిJనా, మిగిలిన వారందరికీ పెను ఉత్పాతమే. అంత పక్కా ప్లానింగ్ తో సెట్ చేస్తుంటాడు. భారతీయ  ఇంటర్నెట్ ని తన గుప్పిట్లో పెట్టుకుని ఒక ఆట ఆడిస్తున్న జియో…ఇప్పుడు ఓటీటీకి వేదికగా మారనుంది. అందుకు ప్రారంభోత్సవంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లైవ్ హక్కులను ఏకంగా రూ.22 వేల కోట్లకు రిలయన్స్ అనుబంధ సంస్థ ‘వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెట్’, పారామౌంట్ గ్లోబల్ సంస్థతో కలిసి కొనుగోలు చేసింది.

దీనివెనుక సూత్రధారి అంతా ముఖేష్ అంబానీ అనే సంగతి అందరికీ తెలిసిందే. దేశంలోని ప్రతి ఒక్కరికి జియో చొచ్చుకుపోవాలన్నదే ప్రధాన కాన్సెప్ట్. ఇంటర్నెట్ నుంచి బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్, కేబుల్ నెట్ వర్క్ వరకు, ఇంకా స్మార్ట్ ఫోన్ నుంచి…టీవీ ప్రసారాలు…అలా అలా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటీటీ కంటెంట్ వరకు తమదే ఆధిపత్యం అనేంతగా చొచ్చుకుపోయేందుకు, అలా కంట్రోల్ హోమ్ కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నారు.

ఇలా గ్రిప్ సాధించాలంటే క్రికెట్ ను పట్టుకుంటే ఇండియన్స్ వలలో పడతారని అనుకున్నారు.  ఐపీఎల్ కు మించి శుభారంభం దొరకదని భావించిన ముఖేష్ అంబానీ వేగంగా పావులు కదిపి ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకున్నారు.. మన దేశ జనాభా సుమారు 125 కోట్లు అయితే… అందులో 55కోట్లకు పైగా యూజర్లున్న జియోని ప్రధాన సాధనంగా తీసుకున్నారు.

ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను ఉచితంగా మొబైల్ ఫోన్లలో లైవ్ ఇచ్చేస్తే…యూజర్ల సంఖ్య 90 కోట్లు దాటిపోతుందని అంటున్నారు.

IPL 2023 On JioCinema | ఇక మొబైల్ నుంచే టీవీ ప్రసారాలను కూడా ఉచితంగా వీక్షించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వినోదం అంతా కూడా జియో నుంచే వస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఇంటి దగ్గర టీవీ చూసేవాళ్ల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతుందని ఒక సర్వే చెబుతోంది. 2018లో 16కోట్లకు పైగా పెయిడ్ టీవీ ఛానళ్ల సభ్యత్వం ఉంటే 2022కి వచ్చేసరికి 10.6 కోట్లకు పడిపోయింది. అందువల్ల ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ రాబోయే రోజులను శాసిస్తుందని తెలిసే…జియో ముందుగా పునాదులు బలంగా వేస్తుందని అంతా అనుకుంటున్నారు.

ఏది ఏమైతేనేం… రాబోయే ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్రీగా చూసేందుకు భారతీయులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: టీమిండియా ఆటగాళ్ల జోరు.. ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన స్పిన్ ద్వయం

 

 

 

Exit mobile version