26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

ప్రపంచంలో గుండ్రంగా ఉండే సరస్సు ఎక్కడుందో తెలుసా?

స్వతంత్ర, వెబ్ డెస్క్: సరస్సులు ఎక్కడైనా గుండ్రంగా ఉండడం చూశారా. విభిన్న ఆకారాల్లో ఉంటూ కనువిందు చేస్తుంటాయి. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో మాత్రం ‘కింగ్స్‌లీ’ లేక్‌ మాత్రం గుండ్రంగా దర్శనమిస్తుంటుంది. ఈ సరస్సును ‘సిల్వర్‌ డాలర్‌ లేక్‌’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా ఉన్న సరస్సు అనేక విశేషాలను కలిగి ఉంది. దాదాపు 2వేల ఎకరాల్లో సహజంగా ఏర్పడిన ఈ చెరువు 5.5 మైళ్ల పొడవుంది. ఉత్తర, పడమర దిశల్లో కలిపి సుమారు 200 రేవులున్నాయి. సుమారు 90 అడుగుల లోతు ఉండడంతో ఫ్లోరిడాలోనే లోతైన సరస్సుగా కూడా పేరుగాంచింది. ఫ్లోరిడాలోనే పురాతన, ఎత్తైన సరస్సుగా నిలిచింది. వేసవి వచ్చిందంటే ప్రజలు కింగ్స్‌లీ లేక్‌‌కు క్యూ కడుతుంటారు. ఈ సరస్సును ఆకాశంపై నుంచి చూస్తే ఒక వెండి నాణెం మెరుస్తున్నట్లుగా గుండ్రంగా కన్పిస్తుండటంతో పైలట్లు దీనికి ‘సిల్వర్‌ డాలర్‌ లేక్‌’ అనే పేరు పెట్టారట.

Latest Articles

ఏపీలో ఎన్డీఏ కూటమి గడ్డుకాలమేనా ?

    ఏపీలో పొత్తులు ప్రత్యర్థికి బలంగా మారిందా.? కూటమి వ్యూహమే కొంప ముంచుతోందా..? బుజ్జగింపు లు పని చేయడం లేదా..? అధినేతలే దిగివచ్చి నచ్చజెప్పినా అలక వీడటం లేదా.? అంటే అవుననే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్