స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఇటీవల విమానంలో ప్రయాణికుల ముఖంపై మూత్రవిసర్జన ఘటనలు జరుగగా.. తాజాగా, మరో విచిత్ర ఘటన జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ట్రైయిన్ మాదిరి అనుకోని బీడీ తాగాడు.. చివరకకు జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు వెళ్లే ఆకాశా ఎయిర్ విమానంలో రాజస్తాన్‌కి చెందిన ప్రయాణికుడు విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో బాత్రూంలోకి వెళ్లి పొత తాగటం ప్రారంభించాడు. ఇది గమనించిన ఫ్లైట్ అటెండర్లు వెంటనే అతన్ని పట్టుకుకోని విమాన అధికారులకు తెలియజేశారు.
అనంతరం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అధికారులు పోలీసులకు అతన్ని అప్పగించారు. అతన్ని పోలీసులు విచారించగా.. తాను రైలు ప్రయాణాలు చేసేటప్పుడు బాత్రూం లో బీడీలు తాగేవాడినని.. అలాగే ఇక్కడ కూడా తాగనికి తెలిపారు. విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి అన్ని.. ఇలా చేయకూడదని తనకు తెలియకూడదన్నారు. ఇతరులు ప్రాణాలకు హాని కలిగించే ఆరోపణలతో ఎయిర్‌పోర్టు పోలీసులు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.