స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా, దేశ పశ్చిమ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ, ఎన్సీబీ.. రెండు టీంలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో.. 2,500 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ఓ నౌకలో అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తో పాటు నౌకలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు.