Site icon Swatantra Tv

తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా

తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence Bureau) బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత(Kavita) ఈడీ విచారణ.. అరెస్ట్ ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) నేతల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో కవిత విచారణ జరగనున్న రోజే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 12న జరగనున్న  CISF పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొననున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్(Intelligence Bureau) వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Exit mobile version