పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. భారత్ ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆరో రోజు స్వప్నిన్ కుసానే మూడో కాంస్యం సాధించాడు. కాగా మను భాకర్ తొలి పతకాన్ని సాధించి భారత్‌కు శుభారంభం చేసింది. తర్వాత సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరోసారి మను బరిలో నిలిచి మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. అయితే నేడు భారత్ మరోసారి మను భాకర్‌ను రంగంలోకి దించనుంది. ఆమె 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ప్రెసిషన్ మ్యాచ్‌లో పోటీపడనుంది. దీంతో పాటు ఈ రోజు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌కు మ్యాచ్ ఉంటుంది.