Site icon Swatantra Tv

టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌

   టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కూ దూసుకుపోయింది టీమిండియా. కప్పు కొట్టేందుకు అడుగు దూరంలో మాత్రమే ఉంది. చివరి సారిగా 2014లో తుదిపోరుకు అర్హత సాధించిన భారత్‌ జట్టు మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్​ పోరుకు సిద్దమైంది. మరోవైపు రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించి తగిన ప్రతీకారం తీర్చుకుంది.

   క్రికెట్‌ క్రీడలో ప్రపంచ దేశాలతో పోటీ పడిన టీమిండియా ఇప్పటి వరకూ మూడు వరల్డ్‌కప్‌లను గెలుచింది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2007లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత్‌ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగా, 2011లో అతని నాయకత్వంలో సరిగ్గా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. మరోసారి టీ 20 ఫైనల్‌లో నెగ్గి టైటిల్‌ సొంతం చేసుకునేందుకు దక్షిణాఫ్రికాను ఢీకొట్టబో తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్‌ ఫైట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఛేజింగ్ చేయాల్సి వస్తే, సఫారీ బౌలర్లను తట్టుకుని నిలబడగలగాలి. ఈ సమయంలో కొహ్లీ ఫాం చాలా ముఖ్యం. అయితే ఇప్పటి వరకూ కోహ్లీ తన బ్యాట్‌ను ఝుళిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోపక్క రేపు ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా సందేహాలు, ఆందోళనలు వ్యక్తం అవుతుండటంతో కెప్టెన్‌ రోహిత్‌ స్పందించారు. కొహ్లీ ఫాం పెద్ద సమస్య కాదని, విరాట్ క్లాస్ ప్లేయర్ అని అతని ఆటతీరు అద్భుతం అని తెలిపాడు. ఇదే సమయం ఫైనల్ లోనూ కొహ్లీ ఉంటాడనటంలో సందేహం లేదని, తుది పోరులో తప్ప కుండా కీలక ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉందని అన్నాడు రోహిత్‌ శర్మ.

Exit mobile version