Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

అంగన్ వాడీ కోడిగుడ్డులో కోడిపిల్ల

పిల్లలకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ఇస్తున్నగుడ్డులో కోడిపిల్ల ప్రత్యక్షమైంది.ఈ ఘటన కోరుట్లలో జరిగింది. చిన్నారి ఆకుల మన్వితకు అంగన్వాడీ టీచర్ ఇచ్చిన కోడిగుడ్డులో పిల్ల ఉంది. గుడ్డును ఉడక బెట్టేటప్పుడు తేలికగా ఉండడంతో పెంకు తొలగిస్తే పిల్ల కదులుతూ కనిపించింది. గర్భిణులు, పిల్లలకు అందజేసే గుడ్లు తక్కువ బరువు ఉంటున్నాయంటున్నారు.

బోనాల జాతర

చెన్నూరు ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మతల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది. ముదిరాజ్‌లు కులదైవంగా కొలిచే పెద్దమ్మతల్లి జాతర వందల ఏళ్లుగా జరుగుతోంది. ఈ బోనాలకు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, తెలంగా ణ నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోరికలు తీర్చే కొంగుబంగారం పెద్దమ్మతల్లి అని భక్తులు నమ్ముతారు.

శ్రీవారిని దర్శించిన పొన్నం కుటుంబం

ఏపీ ప్రభుత్వం, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభా కాంక్షలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాల ని ఆయన ఆకాంక్షిం చారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు.

శ్రీవారిని దర్శించిన గౌతమ్ గంభీర్

టీ 20 వరల్డ్ కప్‌ను 140 కోట్ల భారతీయులకు అందించారని రాహుల్ ద్రావిడ్, రోహిత్‌శర్మ, ఇండియా టీంకు అభినందనలు తెలిపారు గౌతమ్‌ గంభీర్‌. విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ భారతదేశానికి మరిన్ని ట్రోఫీ లు అందించాలని ఆయన కోరారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని గంభీర్‌ దర్శిం చుకున్నారు.

Exit mobile version