Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కాకినాడ జిల్లా తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య వార్‌

     కాకినాడ జిల్లా తాటిపర్తిలో జనసేన వర్సెస్‌ టీడీపీ రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. అపర్ణదేవి ఆలయ బోర్డు బాధ్యతల కోసం ఇరువర్గాల మధ్య వార్‌ ముదురుతోంది. నిర్వహణ కమిటీ కోసం జనసైని కులు, తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆలయ బోర్డు బాధ్యతలు తమకే కేటాయించాలని ఇరుపార్టీల శ్రేణులు పట్టుపడటంతో ఘర్షణ చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్‌ కోసం జిల్లా వ్యాప్తంగా 52 సెంటర్లు ఏర్పాటు చేయగా.. 18 వేల 403 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పర్యవేక్షణలో భాగంగా ప్రతీ పరీక్ష హాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లకు, రికార్డింగ్ వస్తువులు, క్యాలిక్యులేటర్, వాచ్‌లను అనుమతి నిరాకరించారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ను అమలులో ఉంది. నిమిషం ఆలస్యమైనా లోపలికి ఎంట్రీ లేదని ముందే తేల్చి చెప్పిన అధికారులు.. మాస్ కాపీ జరగకుండా ముందస్తుగా జిరాక్స్ షాపులను బంద్ చేయించారు.

Exit mobile version