Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

యాదాద్రికి భక్తుల తాకిడి

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది.

ఏపీ విద్యార్థులకు అవకాశం

2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ తదితర ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశాలు నిర్వహించనుంది. తెలంగాణ విద్యాసంస్ధల్లో కన్వీనర్‌ కోటా సీట్లలో ఏపీ విద్యార్ధులూ చేరవచ్చని పేర్కొంది. 15 శాతం నాన్‌ లోకల్‌ సీట్లకు పోటీ పడవచ్చని తెలిపింది. మెరిట్‌ ను బట్టి ఏపీ విద్యార్ధులకు సీట్లు దక్కుతాయి.

సీపీ ఫొటోకి పాలాభిషేకం

భూ అక్రమణ విషయంలో చర్యలు తీసుకున్నందుకు వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝూ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు హరిహర ఎస్టేట్‌ యజమానులు. 15 ఏళ్ల క్రితం లే అవుట్ చేసిన సర్వే నెంబర్ 158లో దౌర్జన్యంగా చొరబడి, నిర్మాణాలను, హద్దురాళ్ళను ధ్వంసం చేసినవారికి శిక్ష పడేలా చర్యలు తీసకున్నం దుకు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

చెన్నై రైల్వే ఫ్యాక్టరీ

చెన్నై రైల్వే ప్యాక్టరీ అధునాతన రైలు కోచ్‌లను తయారు చేసింది. సౌకర్యవంతమైన బోగీలను రూపొం దించింది. రైలు ప్రయాణీకులకు మధురానుభూతని కలిగించే ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొచ్చారు. పడక గదులు, సమావేశ మందిరాలతో పాటు సకల సదుపాయాలు ఈ రైలు కోచ్‌ల్లో లభించనున్నాయి. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను తలదిన్నేలా వీటిని రూపొందిం చారు.

సీసీఎస్ ఎఎస్ఐ మృతి

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం CCS ASI రమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జూపూడి వద్ద స్ట్రాం గ్ రూమ్స్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నఈయన రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

తృటిలో తప్పిన పెను ప్రమాదం

కర్ణాటక – తుమకూరు రోడ్డు సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్లైఓవర్‌పై వెళ్తున్న కారును తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీ కొట్టి మరో ఫ్లైఓవర్‌పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు గాయపడ్డారు.

కరుంపారై ముత్తయ్య ఆలయంలో ఉత్సవం

మదురై జిల్లా తిరుమంగలం సమీపంలోని పెరుమాళ్‌ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో తిరునాల ఉత్సవం వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన పురుషులు స్వామివారికి పొంగలి నైవేధ్యంగా సమర్పించి ఆరాధించారు. సాంప్రదాయ ఆచారాలలో దేవతకి పొంగల్‌ నైవేధ్యం పెట్టడం అనవాయితీ కాగా 125 మేకలను బలి ఇచ్చి 2500 కిలోల బియ్యాన్ని సమర్పించారు.

మే నెల పుష్పం

ఎర్రని బంతిలా ఆకట్టుకుంటున్న ఈ పుష్పం మే నెల పుష్పంగా ప్రసిద్ది. దీన్ని ఫుట్‌బాల్‌ లిల్లీ లేదా బ్లడ్‌ లిల్లీగా పిలుస్తారు. మన దేశంలో దీన్ని మే పుష్పం అంటారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు ఈ పుష్పం పూస్తోంది. ఒడిశాలోని పర్లాఖెముండి పట్టణంలోని దామోదర్‌ బిహీర్‌ కాలనీలో నివసిస్తున్న సిగ్మా మిశ్రా ఇంట్లో ఈ పుష్పం వికసించింది. పలువురు ఈ పుష్పాన్ని చూసేందుకు ఆసక్తి కనపర్చారు.

విరాట్ కోహ్లీ రికార్డ్

ఐపీఎల్‌-17 సీజన్ టీట్వంటీ పోటీల్లో విరాట్‌ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించారు. ఆర్సీబీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 708 పరుగులు చేసిన కోహ్లి ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700 పైగా స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. భారత్‌ వేదికగా టీ20ల్లో 9వేలకు పైగా స్కోర్‌ను నమోదు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ గానూ నిలిచాడు.

Exit mobile version