Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం బోళ్లపాడు గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసు కున్న టీడీపీ అభ్యర్థి బోయే ప్రసాద్‌ ఘటనా స్థలానికి రాగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చారు.

కూటమి నేతలపై వైసీపీ నేత దౌర్జన్యం

తిరుపతిలో ఎన్డీఏ కూటమి నేతలపై వైసీపీ నేత దౌర్జన్యం చేశారు. సీకాం కాలేజీలోని 250వ నెంబర్‌ బూత్ వద్ధ ఆరణి జగన్‌పై కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి దాడికి దిగారు. దొంగ ఓట్లు వేస్తున్న సమాచారంతో బూత్ వద్ద కు వెళ్లిన జగన్‌ను పోలింగ్ కేంద్రం వద్ద శేఖర్‌రెడ్డి అడ్డుకున్నారు. ఏజెంట్ కాకుండా ఎలా వస్తావని జగన్‌ పై దౌర్జన్యానికి యత్నించారు. అక్కడికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి వచ్చిన ఆమె అనుచరుడు రామకృష్ణను శేఖర్‌రెడ్డి తోసేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పోలీసుల జోక్యంతో సర్దుమణింగింది.

కాలినడకన వెళ్లి ఓటేస్తున్న ఓటర్లు

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి రహదారి లేకపోయినా ప్రజలు కాలిన డకన గుట్టలు, వాగులు దాటుకుంటూ వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సుమారు 18 కిలోమీటర్లు వెళ్లి గిరిజనులు ఓటేస్తున్నారు. పట్టణాలలో ఉంటూ ఓటును వినియోగించుకునేందుకు నిరాకరిస్తున్న ప్రజలకు పెనుగోలు గిరిజనులు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా 18 కిలోమీటర్లు గుట్టలు దాటుతూ తమ ఓటు హక్కును వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా యే తప్ప తమ తలరాతలు మారడం లేదని… ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని పెనుగోలు గిరిజనులకు కోరుతున్నారు.

ఓటింగ్ వాట్సాప్‌ స్టేటస్‌

చిత్తూరు జిల్లా కుప్పంలో పోలింగ్‌ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. సెల్‌ఫోన్‌తో పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించాడు ఓ ఓటరు. ఓటును ఓటు హక్కును వినియోగించుకుంటున్న వీడియోను తీసుకుని వాట్సా ప్‌ స్టేటస్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు అధికారులు.

ఛాలెంజ్ ఓటు

కృష్ణాజిల్లా యనమలకుదురు బూత్‌ నెంబర్‌ 67లో గందరగోళం ఏర్పడింది. ఓటు వేసే క్రమంలో తన అనుమతి లేకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసాడు ప్రిసైడింగ్‌ అధికారి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఓట రు తన ఓటు హక్కును చాలెంజ్‌ ఓటు ద్వారా వినియోగించుకున్నాడు. పీఓ తీరుని పలువురు తప్పు పట్టిన పలువురు ఓటర్లు పీఓ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

ఓటు హక్కు వినియోగించుకున్న హో మంత్రి

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకంటున్నారు. పిరంగిపురం గ్రామంలో మాజీ హోం శాఖా మంత్రి సుచరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సుచరిత.

వాయుసేన మాజీ అధిపతి చేదు అనుభవం

భారత వాయుసేన మాజీ అధిపతి ప్రదీప్‌ వసంత్‌ నాయక్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఓటు వినియోగించుకునేం దుకు పుణెలోని పోలింగ్‌ కేంద్రానికి కుటుంబసభ్యులతో కలసి వచ్చిన ఆయనకు తన భార్య పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అధికారుల్ని అడిగితే తామేమి చేయలేమని చేతులెత్తేసారు. స్లిప్స్‌ ఉన్నా జాబితా నుంచి పేర్లు ఎదుకు డిలీట్‌ అయ్యాయో గుర్తించాలని కోరారు.

ఓటేసిన ట్రాన్స్‌జెండర్స్‌

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె పోలింగ్‌ స్టేషన్లో ట్రాన్స్‌జెండర్స్‌ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. తొలి సారి ఓటు హక్కు వినియోగించుకోవడంపై హర్షం వ్యక్తం చేసారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేసారు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అగ్రహం

కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఏజెంట్‌పై దాడికి దిగారు. చాపాడు మండలం చిన్న గులువ లూరు పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. జరిగిన ఘటనపై టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అగ్రహం వ్యక్తం చేసారు. దాడి ఘటనను ఖండించిన ఆయన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసారు.

దొంగ ఓట్లు

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. కిడ్నాప్‌కు గురైన సదుం మండలం బూరగుమంద గ్రామంలోని 188, 189, 190 పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్లను గుర్తించి పోలీసులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేర్చారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి.

ఆందోళనకు దిగిన ఓటర్లు

వరంగల్ జిల్లా కిలా వరంగల్ లో ఓటర్లు ఆందోళనకు దిగారు. బాలాజీ హై స్కూల్ లోని 217 బూత్ లోని ఓటర్లు తమకు డబ్బులు అందలేదంటూ నిరసన వ్యక్తం చేసారు. డబ్బులిస్తే గాని తమ నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. 1300 మంది ఓటర్లకు గాను 113 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు.

ఓటేసిన కెలెక్టర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి. సంగం లక్ష్మి బాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసారు. సాధారణ పౌరులవల్లే క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.

వైఎస్ సునీతకు ఐడీఎస్ఎ ఫెలోషిప్‌కు ఎంపిక

వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతకు ప్రతిష్టాత్మక ఇన్ఫెక్షన్‌ డీసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా – IDSA ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. ఈ ఫెలోషిప్‌ను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సునీత పేర్కొన్నారు. మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతున్న అంటు వ్యాధులను ఎదుర్కోవడం, రోగుల ఆరోగ్య సంరక్షణ విషయంలో తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

ఆకాల వర్షంతో పంట నష్టం

అకాల వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మహాదేవపూర్ మండ లంలోని కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. లోడింగ్‌ చేయడంలో హమాలీల తీరు వల్ల నే చేతికొచ్చిన పంట ఇలా నీటిపాలయ్యిందని వాపోయారు. వడ్లు కల్లాల వద్ద పోసి 15 రోజులైనా హమాలీ లు లోడ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు రైతులు.

15న సీపీగెట్‌ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష – సీపీగెట్‌ నోటిఫికేషన్‌ ఈనెల 15న విడుదల కానుంది. ఎంఏ., ఎంకాం., ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష రాయాల్సివుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఏదైనా కోర్సులో 10 కంటే తక్కువ మంది చేరితే ఆ కోర్సును మూసివేయా లనే నిబంధనను ఈ సారి కూడా పాటించనున్నారు.

మాజీ ఎంపీ సెల్వరాజ్‌ మృతి

తమిళనాడు కమ్యునిస్టు పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ సెల్వరాజ్‌ మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరనిలేటన్నా రు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన సెల్వరాజ్‌ సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు.

గురుద్వార్ లో మోది

బీహార్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్ర రాజధాని తఖత్‌ శ్రీ హరిమందిర్‌ జీ పట్నా సాహిబ్‌ను దర్శిం చుకున్నారు. గురుద్వార వద్ద భక్తులకు లంగర్‌ సేవ చేసారు. రోటీలు తయారు చేసారు అనంతరం స్వయంగా లంగర్‌ వడ్డించారు.

జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో సచిన్ సఫారీ

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో సఫారీ చేసాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో త్రోబాక్‌ పోస్ట్‌లో పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. జిమ్‌ కార్బెట్‌ సఫారీ అనేది పార్కులో నడవడమే కాదు.. ఇట్స్‌ ఏ రైడ్‌ ఇన్‌ ది వైల్డ్‌ అని తన పోస్ట్‌కి క్యాప్షన్‌ పెట్టాడు.

కమీ రీటాద మరో రికార్డ్

నేపాలీకి చెందిన 54 ఏళ్ల షెర్పా కమీ రీటా 29వ సారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకు న్నాడు. ఎవరెస్ట్‌ మ్యాన్‌గా పేరొందిన షెర్పా ప్రపంచంలో వ్యక్తిగతంగా ఎక్కువసార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా నిలిచాడు. ఎనిమిది వేల 848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి సీనియర్‌ గైడ్‌ హోదాలో కమీ రీటా చేరుకున్నట్లు సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ అనే సంస్థ ప్రకటించింది. నేపాల్‌ పర్యాటక శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది.

Exit mobile version