Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్

కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక ఎన్నికల నిర్వహ ణాధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. గత ఐదేళ్ల పాలనలో జగన్‌ సారథ్యంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు రఘురామిరెడ్డి.

దళితులను అవమానించిన చరిత్ర టీడీపీదే- జూపూడి

దళితులను అవమానించిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల సమయం లో జగన్‌పై కావాలనే దళిత వ్యతిరేక ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొన్ని ఘటనల వల్ల దళితులకు అన్యాయం జరిగిండవచ్చు కానీ సామూహికంగా దళిత గ్రామాల మీద దాడి చేసిన చరిత్ర టీడీపీ నేతలదేనని చెప్పారు. దళితుల పక్షాన మాట్లాడడానికి చంద్రబాబు, సహా టీడీపీ నేతలకు ఒక్క రోజు కూడా సమయంలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల టైంలో జగన్‌పై కావాలనే బురదజల్లుతున్నారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామిదాస్ నామినేషన్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగట్ల స్వామి దాస్‌ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మాధవికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆయన. ఏపీలో మొదటి నామినేషన్ వైసీపీ తరఫున స్వామి దాఖలు చేశారని..నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటికే సర్వేలు 135 సీట్లు గెలుస్తామని తెలుపాయని..175 స్థానాలు గెలిచే విధంగా పయనిస్తున్నామని చెప్పారు.

కొమురం భీం జిల్లాలో రిషి మృతి కేసు దర్యాప్తు వేగవంతం

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పదేళ్ల బాబు రిషి మృతిపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. రెబ్బెన మం డలం పసిగం గ్రామంలోని పులాజి బాబా ఆశ్రమ ఆవరణలో మరణించాడని చెబుతున్న బాలుడు రిషి డెత్ మిస్టరీని చేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులచే దర్యాప్తు చేపట్టి రిషి మృతికి గల కారణాలపై ఆరా తీయనున్నారు పోలీసులు

సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు సమాధి కూల్చివేత

సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు ఫాతిమా వందేళ్ల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చి వేశారని.. హైదారాబాద్ జన్నూల్ బాకీ ఆర్గనైజేషన్ బొప్పర మౌలానా ఫయాజ్ అలీ అన్నారు. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు. 1926లో సౌదీలోని ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని..దాన్ని నేడు సౌదీ ప్రభుత్వం కూల్చివేసిందని అన్నారు. తిరిగి దాన్ని పునఃనిర్మించా లని డిమాండ్ చేశారు. లేదంటే ఆ ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇచ్చినా తామైనా కట్టుకుం టామని తెలిపారు.

రామాయణం హిందీ అనువాదం పుస్తక ఆవిష్కరణ

హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రామాయణం హిందీ అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తక ఆవిష్కరణపై ప్రగ్యా బంక, అనంత్ కైతాన్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. రాముడు అందరివాడని, విశ్వ మానవాళి క్షేమం కోరిన మహా పురుషుడని కీర్తించారు. ప్రజానీకానికి సులువుగా అర్థమయ్యే, భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాషలో అనువాదం చేసే భాగ్యం తమకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. రామాయణం అనువాదాలు ఇప్పటికే అనేక భాషల్లో ఉన్నా సమాజంలో దానిపై ఇంకా కొంతమంది అనేక అనుమానాలు సృష్టించారు. ఆ అపవాదాలను పటాపం చలు చేస్తూ వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి ఇంగ్లీషులోకి అమీ గనాత్రాజీ తిరిగి రాశారు.

దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్‌రెడ్డి నామినేషన్

ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్‌ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు రాజంపల్లి ఆంజనే య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్సార్ దీవెనలతో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామన్నారు శివప్రసాద్. రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేసిన సీఎం జగన్‌ వెంట ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు పిలిస్తే కరువు వస్తుందే తప్ప ప్రజలు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Exit mobile version