Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కేసీఆర్‌తో రాజయ్య భేటీ

తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. పార్టీ కీలక నేతలతో కలసి కెసీఆర్‌ని కలిసారు. దీంతో స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గ బాధ్యతల్ని రాజయ్యకు అప్పగించారు కేసీఆర్‌. ఎంపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ గెలుపుకు కృషిచేయాలని సూచించారు. ఈ భేటీతో కాంగ్రెస్‌లో రాజయ్య చేరుతారన్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ఇదో కొత్త డ్రామా

జగన్ పై జరిగిన దాడి ఓ రాజకీయ నాటకమన్నారు సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆది మూలం. కోడి కత్తి డ్రామా ముగియకముందే కొత్తగా గులకరాయు డ్రామా మొదలు పెట్టారని హేళన చేసారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్తారని తిరుపతి జిల్లా సత్యవేడులో అన్నారు.

‘జన’ నేతల్ని గుర్తించండి

పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ కోఅర్డినేటర్‌ శ్రీనివాస్‌ తీరుపై నేతలు మండిపడ్డారు. పవన్‌ సోద రుడు నాగబాబు సమక్షంలో ఆయన తీరును ఎండగట్టారు. జనంలో తిరిగే నేతల్ని, కార్యకర్తల్ని గుర్తించండి అంటూ మొరపెట్టుకు న్నారు. లేకుండా రానున్న ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరగక తప్పదని వాపోయారు. అటు అసెంబ్లీ నిర్వహణ కమిటీల పేరుతో వైసీపీ వలసదారులకు పలు కమిటీల్లో స్ధానం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసాయి పార్టీ శ్రేణులు.

ఇంటింటి ప్రచారం

బాపట్ల జిల్లా బల్లికూరవ మండలం ముక్తేశ్వరంలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా అన్న కుమారుడు కమల కిషోర్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి జీరో అంటూ వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్ధికి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేసారు.

పోటీకి ‘సై’

విజయనగరం అసెంబ్లీ స్ధానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. పార్టీ మనుగడకోసం పనిచేసిన తనకు టికెట్‌ కేటాయింపులో తీవ్ర అన్యా యం జరిగిందని వాపోయారు. పార్టీ ప్రయోజనాల ఎన్నో అవమానాలు భరించిన తనకు అధిష్టానం తీరు మరింత బాధించిందన్నారు.

ఆర్యవైశ్యులకు రక్షణ ఏదీ?

వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేదన్నారు టీడీపి రాష్ట్ర వర్తక సంఘం అధ్యక్షులు దిండి రాకేష్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో 12 మంది ఆర్యవైశ్యులు కత్తి పొట్లకు గురయ్యారన్న నేతలు తమ స్వార్ధ రాజకీయాలకు వైశ్యులను బలి చేయవద్దని హితవు పలికారు.

వైసీపీకి బై..బై

కర్నూలు జిల్లా ఆలూరు ఆరికెర గ్రామానికి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ మండల కన్వీనర్‌ బొగ్గుల ఈరన్న నేతృత్వంలో వీరంతా వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. జగన్ అరాచకాలను చూడలేక పెద్ద సంఖ్యలోతరలి వచ్చి టీడీపీకి మద్దతు పలకడం సంతోషదాయకమన్నారు వీరభద్రగౌడ్‌.

శాంతి ర్యాలీ

సీఎం జగన్ పై దాడిని ఖండిస్తూ ఆత్మకూరు పట్టణంలో శాంతి ర్యాలీ జరిగింది. శ్రీశైల నియోజకవర్గ నేత శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంనుండి.. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక రాళ్ల దాడి చేసి గాయపరచడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు భువనేశ్వర్‌ రెడ్డి.

కొవ్వొత్తుల ర్యాలీ

సీఎం పై రాయి దాడిని నిరసిస్తూ చంద్రగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇది ప్రతిపక్షాల కుట్రతో జరిగిన దాడికి పేర్కొన్నారు మోహిత్‌రెడ్డి. దాడి ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసారు.

ఉరుసు ఉత్సవాలు

మేడ్చల్ మండల పరిధి డబిల్ పూర్ గ్రామం సబీల్ దర్గా షరీఫ్ లో ఉరుసు ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన వీధుల్లో ఒంటెలు, గుర్రాలపై ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర యాదవ్ పాల్గొని అల్లాను దర్శించుకున్నారు. పలు జిల్లాల నుంచి మతాలకతీతంగా తరలివచ్చి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

కోడ్‌ ఉల్లంఘన – 32 మందిపై కేసు

సీఎం జగన్‌ పై రాయి దాడిని ఖండిస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసారు చిత్తూరు జిల్లా రామ కుప్పం వైసీపీ నేతలు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా దిష్టిబొమ్మని దగ్ధం చేయడంపై ఎన్నికల అధికా రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘటనా స్ధలానికి చేరుకున్న MCC స్క్వాడ్‌ బృందం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం రామకుప్పం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బల్ల సర్పంచ్‌తోపాటు 32 మందిపై కేసు నమోదు చేసారు పోలీసులు.

పట్టాలు తప్పిన గూడ్స్‌

తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో చెన్నై – బెంగళూ రు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై కోర్టు నుండి బెంగళూరు వైట్ ఫీల్డ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లోకోపైలట్‌ సమయస్ఫూర్తితో ట్రైన్‌ను ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

Exit mobile version