Site icon Swatantra Tv

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

చెలరేగిపోతోన్న మట్టి మాఫియా

తూర్పుగోదావరి జిల్లా హోం మంత్రి సొంత నియోజకవర్గంలో గోపాలపురం మట్టి మాఫియా చెలరేగి పోతోంది. జగనన్న కాలనీ ముసుగులో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహి స్తున్నారు. అధికార పార్టీ నేతలు అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకో లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపాలెం గ్రామంలో దేవరకొండ, షాపుడు కొండలను గ్రామ సర్పంచ్ అక్రమ తవ్వకాలు రవాణా చేస్తూ తన జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకకు నాగర్‌కర్నూల్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Exit mobile version