ఆగస్ట్ 15 సమయం దగ్గరకు వచ్చేస్తోంది. అదేంటి అంటారా ఆ తేదీలోగా రెండు లక్షల లోపు పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటారా ? ఇప్పటికే ఓవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై నిలదీస్తున్న వేళ నిధుల కోసం వేట మొదలు పెట్టింది రేవంత్ సర్కారు. కేవలం ఇదే కాదు. రైతు భరోసా, రైతు బీమా పథకం కోసం మొత్తం రాబోయే రెండు నెలల్లో 30 వేల కోట్లు అవసరమ వుతాయని అంచనా వేసింది. మరి.. ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న ప్రశ్న తలెత్తుతోంది.
రెండు నెలల్లో రూ. 30 వేల కోట్ల రుణం వస్తుందా ?
