Site icon Swatantra Tv

పిఠాపురంలో.. పవనోత్సాహం

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది.. ఈసారి పోలింగ్ శాతం 86.63గా ఈసీ డిక్లేర్ చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్‌ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్‌ పోటీ చేయడంతో పోలింగ్‌లోనూ ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44శాతం.. 2019లో 80.92శాతమని లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తికాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు.. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2014లో 79.44శాతం నమోదైంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది.

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఇక్కడ అందరి దృష్టి పెరిగింది. పోలింగ్‌ రోజుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూకట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టిక్కెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గుచూపని వారు సైతం.. ఈసారి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్ భారీగా పెరిగింది. దాంతో పవన్ గెలుపు ఖాయమంటూ జనసైనికులు ధీమాగా ఉన్నారు.

Exit mobile version