Site icon Swatantra Tv

వయనాడ్ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తా – ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇవాళ ఎంపీగా ఆమె ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ.. వయానాడ్ నుంచి భారీ విజయాన్ని అందుకున్నారు.

దాదాపు నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ఆమె సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రికార్డును సైతం బ్రేక్ చేశారు. గట్టిపోటీనిస్తుందనుకున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడోస్థానంలో నిలిచారు. వాయనాడ్‌లో గెలిచిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక గాంధీ. వయనాడ్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ప్రకటించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version