ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2 రిలీజై.. సంవత్సరంన్నర అయ్యింది. ఇంత వరుకు బన్నీ నుంచి కొత్త సినిమా రిలీజ్ కాలేదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న రాకా మూవీ ఎంత వరుకు అయ్యిందో క్లారిటీ లేదు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మూవీని ప్రకటించారు కానీ.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. రాకా వచ్చేది ఎప్పుడు..? లోకేష్ కనకరాజ్ తో మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..? అసలు ఐకాన్ స్టార్ ప్లాన్ ఏంటి..? తెలుసుకుందాం రండి..
పుష్ప, పుష్ప 2 సినిమాలతో.. అల్లు అర్జున్.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో బాలీవుడ్లో సైతం భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ కు తగ్గట్టే.. అల్లు అర్జున్ అట్లీతో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. అదే రాకా. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినీ అభిమానులకు షాక్ ఇచ్చారని చెప్పచ్చు. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ బయటకు రావడం లేద. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
ఇలా సినిమా లేట్ అవ్వడం వలనే.. ఇక నుంచి తన సినిమా సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే రాకా సెట్స్ పై ఉండగానే బన్నీ నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేయబోతున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ప్రకటించలేదు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. రాకా షూటింగ్ కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైమ్ పడుతుందట. అందుకనే.. రాకా రిలీజ్ కంటే ముందుగా అక్టోబర్ లో లోకేష్ కనకరాజ్ తో భారీ సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే నటింనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. బన్నీ, పూజా కలిసి దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సస్ అయ్యింది. ఆతర్వాత వీరిద్దరూ కలిసి అల.. వైకుంఠపురములో అనే మూవీలో నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఈ క్రేజీ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి బన్నీ, పూజా కలిసి నటించనున్నారని.. లోకేష్ కనకరాజ్ తో చేసే మూవీ కోసం ఈ బుట్టబొమ్మను ఫైనల్ చేసారనే వార్త వైరల్ అయ్యింది. అయితే.. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. లోకేష్ కనకరాజ్ మూవీ స్టార్ట్ కాగానే.. మరో సినిమాని ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఐకాన్ స్టార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడాని పక్కా ప్లాన్ రెడీ చేసారని టాక్.


