Site icon Swatantra Tv

హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని అన్నారు. తదుపరి మూసీ రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు.

Exit mobile version