Site icon Swatantra Tv

పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది – పవన్‌కల్యాణ్‌

అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే వ్యక్తి సీఎం చంద్రబాబు మాత్రమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని గుర్తు చేశారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామపంచాయతీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యం అని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు అవసరమన్న పవన్…పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందని చెప్పారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. అవసరమైతే గూండా యాక్ట్‌ తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అని అన్నారు. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తామన్న పవన్… వలసలను అరికట్టేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ తీసుకొస్తామని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Exit mobile version