తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించానని చెప్పారు. ..ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానని చెప్పారు. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించానని అ న్నారు. తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానని… ఏ పరాయి మహిళతోను అనైతిక సంబంధాలు లేవని వివరించారు. తాను నమ్మిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెబుతానని విజయసాయిరెడ్డి చెప్పారు.