Site icon Swatantra Tv

నా విజయానికి రాజయ్య సహకరిస్తాడని నమ్ముతున్నా- కడియం

స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కృతజ్ఞతలు చెప్పారు. గురువారం కడియం మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌ టికెట్ తనకు కేటాయించినందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల సహకారం తీసుకుంటానని అన్నారు.

పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.. త్వరలో సర్దుమణుగుతాయని తెలిపారు. గతంలో రాజయ్య గెలుపు కోసం తాము కృషి చేశామని గుర్తుచేశారు. నా విజయానికి రాజయ్య సహకరిస్తాడని నమ్ముతున్నా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధే నా అజెండా అని అభిప్రాయప్డడారు. గత ఎనిమిదేళ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుందని అన్నారు.

Exit mobile version