Site icon Swatantra Tv

స్టేషన్ ఘనపూర్ కు నేనే సుప్రీం.. ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యే అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఎంపికపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిస్థితులు చూస్తే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదని వెల్లడించారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. కోలాటమాడాలన్నా భయపడుతున్నారని వెల్లడించారు. ఎందుకు అభద్రత భావంలో ఉన్నారో అర్దం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యే. స్టేషన్ ఘనపూర్ కు నేనే సుప్రీం అంటూ కీలక ప్రకటన చేశారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ను కడియం శ్రీ హరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. దీంతో రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమించారు.

Exit mobile version