నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలుపై హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో అనుసరిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాలను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆక్రమణలకు ఆస్కారం లేకుండా క్షణాల్లో సమాచారం వచ్చేలా ప్రత్యేక యాప్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని, క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన, చర్యల నమోదు తదితర వివరాలను యాప్లో నమోదు చేయవచ్చని రంగనాథ్ తెలిపారు.