Site icon Swatantra Tv

House Rent: బెంగళూరులో అద్దెంటి కోసం ఓ జంటకు వింత అనుభవం

స్వతంత్ర వెబ్ డెస్క్: బెంగళూరు(Bangalore)లో ఓ జంటకు వింత అనుభవం ఎదురైంది. అద్దెంటి కోసం(House Rent) ఓ యజమాని వాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. తర్వాత షార్ట్‌లిస్ట్‌(Shortlist) చేసి ఎంపిక చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం వైరల్‌(Viral)గా మారింది.

 నగరాల్లో కొత్తవారికి ఇల్లు అద్దెకివ్వడం(House Rent) అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అందుకే ఇంటి యజమానులు.. అద్దె కోసం వచ్చే వారి కుటుంబ స్థితి, ఉద్యోగ వివరాలు వంటివి ఆరా తీస్తారు. గుర్తింపు కార్డు(Identity Card) జిరాక్సులు కూడా అడిగి తీసుకుంటారు. అదే బెంగళూరు(Bangalore) లాంటి నగరాల్లో ఐతే ఈ ప్రక్రియ మరింత క్లిష్టతరం. ఈ మహా నగరంలో ఇంటిని అద్దెకు తీసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చాలా మంది సోషల్‌మీడియా(Social) వేదికగా నిత్యం గోడు వెళ్లబోసుకుంటూ ఉంటారు. ఇదీ అలాంటి ఘటనే. ఇంటి అద్దె కోసం వెళ్లిన ఓ జంటకు యజమాని నుంచి వచ్చిన ఆఫర్‌(Offer) వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెంగళూరు(Bangalore)లో అద్దెంటి కోసం అన్వేషిస్తున్న ఓ జంట ఇటీవల ఓ ఇంటిని సందర్శించింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని నుంచి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని ఇషు అనే ఎక్స్‌ యూజర్‌ యథాతథంగా పోస్ట్‌ చేశారు. అందులో సదరు ఇంటి ఓనర్‌ ఏం రాశాడంటే…? ‘‘హాయ్‌! ఆ రోజు మీ ఇద్దరినీ కలిసినందుకు ఆనందంగా ఉంది. మా ప్రాపర్టీ(Property) చూసిన వాళ్లను వ్యక్తిగతంగా కలుస్తున్నానని మీకు ఆ రోజే చెప్పాను. ఇప్పటి వరకు ఇల్లు అద్దెకు కావాలని చాలా మంది ఆసక్తి చూపినా అందరినీ కలవలేదు. నన్ను కలిసిన వాళ్లలో కొందరిపై మంచి అభిప్రాయం, ఇంటిని చక్కగా నిర్వహించగలరన్న నమ్మకం ఏర్పడింది. అందులోంచి షార్ట్‌ లిస్ట్(Short list) చేశాను. అందులో మీకు ఫస్ట్‌ ఆఫర్‌ ఇస్తున్నా’’ అని ఆ జంటకు సందేశం పంపారు.

దీన్ని ఇషా(Isha) తన ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంటర్వ్యూ తర్వాత మా ఓనర్‌ మమ్మల్ని ఎంపిక చేశారు’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఈ తరహా ఎంపికను తాను ఊహించలేదని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు తమ స్పందనను తెలియజేశారు. ‘ఇదేదో జాబ్ ఆఫర్‌లా ఉందే’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా.. ‘హెచ్‌ఆర్‌ రౌండ్‌ అయిపోయింది.. ఇక టెక్నికల్‌ రౌండా?’ అంటూ మరో నెటిజన్‌ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. ‘ఇక ఆ యజమానిని మీరు ఇంటర్వ్యూ చేయండి’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

బెంగళూరు(Bangalore) నగరంలో ఇళ్ల కొరత విపరీతంగా ఏర్పడింది. డిమాండ్‌కు తగినట్టుగా ఖాళీ ఇళ్లు కనిపించడం లేదు. దాంతో అద్దెలు (Rentals) ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 40 శాతం మేర కిరాయి పెంచారని తెలిసింది. దీంతో బ్రోకర్లు కొందరు ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌(Field Executives)ను నియమించుకొని ‘ఇళ్ల వేట ప్యాకేజీలు’ ప్రకటిస్తున్నారు.

‘నగరంలో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. కొవిడ్‌ వల్ల సాఫ్ట్‌వేర్‌ సహా అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. దాంతో వీరంతా సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. కంపెనీలు ఇప్పుడు వెనక్కి పిలిపిస్తుండటంతో ఒక్కసారిగా అద్దె కొరత ఏర్పడింది. వైట్‌ఫీల్డ్‌ వంటి ప్రైమ్‌ లోకేషన్లలో 2 బిఎచ్కె  ఇంటి అద్దె నెలకు రూ.35,000-38,000కు పెరిగింది. గతంలో ఇక్కడ రూ.25,000 ఉండేది.

గేటెడ్‌ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్లు రూ.50,000 కన్నా తక్కువకు లేవు. ఇందిరా నగర్‌లోని సర్జాపురాలో 3బిఎచ్కె అద్దె ఏకంగా రూ.80,000. అద్దెలు పెరగడంతో చాలామంది శివారు ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిసింది. హొసూరు, బెగూరు వంటి ప్రాంతాల్లో 2బిఎచ్కె రూ.15,000-20,000 దొరుకుతున్నాయి. అయితే ఈ అద్దెలు పెరిగేందుకు ఎక్కువ సమయం పట్టదని బ్రోకర్లు అంటున్నారు.

Exit mobile version