Site icon Swatantra Tv

బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాహిత యాత్రలో మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు హుస్నాబాద్ లో నిర్వహించనున్న ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పలుచోట్ల ప్రజాహితయాత్ర ఫ్లెక్సీలను చింపివేసి దహనం చేశారు. దీంతో ఇటు బిజెపి పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి ఘర్షణలు జరగకుండా పలుచోట్ల అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ఇటు బిజెపి పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ఉల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బొమ్మనపల్లి శివారులో ఎదురెదురుగా పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్న కాంగ్రెస్, బిజెపి పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ బండి సంజయ్ విశ్రాంతి తీసుకుంటున్న బొమ్మనపల్లిలోని ఓ పాఠశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Exit mobile version