Site icon Swatantra Tv

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు, సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర, సీబీఐ తరఫున అనిల్ తల్వార్ తమ వాదనలు వినిపించారు. మూడు రోజులు పాటు వాదనలు విన్న హైకోర్టు నేడు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. దీనిపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 30 వరకు ప్రతి శనివారం సీబిఐ విచారణలకు హాజరు అవ్వాలని, సీబీఐకి సహకరించాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది.

Exit mobile version