Site icon Swatantra Tv

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ MRO కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లగచర్లలో పోలీసులు తీరును తప్పుపడుతూ.. నిరసనగా ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు వై మురళీధర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్నాకు అనుమతి ఇచ్చారు.

Exit mobile version