తన కొత్త సినిమా ‘దసరా’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో నాని విశాఖపట్నం స్టేడియంలో సందడి చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆరోన్ ఫించ్‌తో సరదాగా సంభాషించాడు. అంతేకాదు కవర్ డ్రైవ్స్ చేస్తూ అలరించాడు. దసరా మూవీలో పోషించిన ధరణి పాత్ర పేరుతో ప్రత్యేకంగా తయారు చేయించిన జెర్సీని వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్‌తో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో స్టేడియంతా ఈలలతో మార్మోగింది. ఇక తన సినిమాలోని పేర్లలో భారత క్రికెటర్లలో ఎవరికి ఏ పేరు సరిపోతుందో తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ‘జెంటిల్‌మెన్’.. విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ‘గ్యాంగ్ లీడర్’.. హార్దిక్ పాండ్య (Hardik Pandya)కి ‘పిల్ల జమిందార్’ టైటిల్స్ బాగుంటాయని పేర్కొన్నాడు.