Site icon Swatantra Tv

ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందని కోమటిరెడ్డి అన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు.

హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్కొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version