Site icon Swatantra Tv

తెలంగాణలో పలు చోట్ల భారీగా కురిసిన అకాల వర్షాలు

   ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

   రేపు అదిలాబాదు, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఎల్లుండి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం కురిసిన వడగళ్ల వా నకు వరి, మామిడి, నువ్వు పంటలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.హనుమకొండ జిల్లా భారీ వర్షం కురిసింది. ఎల్కతుర్తి,భిమాదేవరపల్లి కమలాపూర్ లో ఉరుములతో ఈదురుగాలులతో వర్షం పడింది. దాంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

  నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయా యి. కోతకొచ్చిన మామిడి కాయలు రాలిపోయా యి. ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్‌పూర్‌లో మూడు గేదెలు చనిపోయాయి. పలుమండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోతదశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25 శాతం పంట కోయాల్సి ఉంది.వడగళ్ల వర్షానికి ఇందల్వాయి, ధర్పల్లి, నందిపేట్‌, మాక్లూర్‌, డొంకేశ్వర్‌, మోపాల్‌, ఆలూ ర్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, రెంజల్‌ మండలాల్లోని కల్లాలు నీటమునిగాయి. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపో యింది. వారం రోజులుగా అకాల వర్షాలు పంటలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు తడిసిన వడ్లకు మొలకలు వచ్చే అవకాశముంది. కల్లాల్లో నేడో, రేపో అమ్ముడుపోయే ధాన్యం పూర్తిగా తడిసిముద్ద కావడంతో రంగుమారిన పంటను ఎలా అమ్ముడుపోతుందోనని రైతులు దిగులు చెందుతున్నారు. వర్షానికి నేల మెత్తగా మారడంతో వరికోతలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.

   ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజోన్న పంటల రైతులు నష్టపోయారు. కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బ తీసింది. కల్లాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. ఈదురు గాలులతో కూడిన వానకు మొక్కజొన్న, వరి పంటలు నేలపాలయ్యాయి. మాచారెడ్డి మండలం లోని పలు గ్రామాల్లో మామిడికాయలు నేలరాయి. ఇంటి పై కప్పులు, రేకులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

   సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఐకెపి సెంటర్లలో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్ద యింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి పది రోజులు గడుస్తున్న పూర్తిస్థాయిలో తూకం వేసి కొనుగోలు జరపకపోవడంతో మార్కెట్ యార్డులలో ఐకెపి కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్ద యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version