Site icon Swatantra Tv

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

    తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈరోజు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వానలు పడే అవకాశముందని చెప్పారు. రేపు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

Exit mobile version