Site icon Swatantra Tv

వరంగల్ మానుకోట పార్లమెంట్‌లో వేడెక్కిన రాజకీయం

      వరంగల్ మానుకోట లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈసారి ఈ స్థానం నుంచి ముగ్గురు అనుభవజ్ఞులు బరిలో ఉన్నారు. ముగ్గురు ఎంపీగా గెలిచినా ఒకరు మాత్రం కేంద్ర మంత్రిగా పని చేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒకసారి గెలిచినవారు మరోసారి గెలిచిన దాఖలు లేవు. వాళ్లే మరోసారి పోటీ పడుతుండటంతో జిల్లాలో హాట్‌ చర్చ నడుస్తోంది.

     బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో దిగుతుండగా…బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు ఈ స్థానం బెర్త్ కన్ఫార్మ్ అయినట్లుగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆయన పేరు ప్రకటించడం ఇక లాంఛనమేనని చెప్పు కోవాలి. ఈ మేరకు ఆదివారం మధ్యా హ్నం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుచుగ్ సమక్షంలో సీతారాం నాయక్ కాషాయ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి నాలుగు రోజుల క్రితం హన్మ కొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లిన రోజే ఆయన కమలంలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మానుకోట టికెట్ ఇస్తామనే కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఆయన పార్టీలో చేరినట్లు సమా చారం. ఆయన చేరికతో మానుకోటలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లయింది.

     నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత 2009లో తొలిసారి బలరాం నాయక్ మానుకోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ కేబినెట్‌లో చోటు దక్కించుకు న్నారు. ఆ తర్వాత జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా సీతారాం నాయక్ చేతిలో బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు. 2019లో అప్పటి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్‌కు టికెట్ దక్కక పోగా, మాలోతు కవితకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాంపై కవిత విజయం సాధించారు.

     ప్రస్తుతం బరిలో నిలవనున్న ముగ్గురు నేతల్లో బలరాం నాయక్ ఒక విజయం, రెండు ఓటములతో నిలవగా, పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించిన సీతారాం నాయక్ బీజేపీ నుంచి రెండోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇక కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండగా, రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మానుకోట లోక్‌సభ నియోజకవర్గంపై గతంలో విజయ దుందుంభి మోగించిన ముగ్గురు మళ్లీ పొలిటికల్ ఫైట్‌లో ఉండబో తున్నారు. ముగ్గురు అనుభవజ్ఞులు, సీనియర్ పొలిటీషన్ల మధ్య మానుకోట ఎంపీ ఎలక్షన్స్ అత్యంత రసవత్తరంగా ఉంటాయన్న అంచనా లున్నాయి.

      మానుకోట లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తుండగా..సిట్టింగ్ ఎంపీ కవితకు మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాల్లో కొంత సొంత క్యాడర్‌ ఆమెకు గట్టి పోటీ ఇచ్చేందు కు నిలబెడుతుందన్న అంచనాలున్నాయి. అలాగే సీతారాం నాయక్‌ను బీజేపీ బరిలోకి తేవడం ద్వారా పార్టీ ఓటు బ్యాంకు పెంపొందు తుందనే విశ్లేషణ జరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మహబూబాద్, డోర్న కల్, ములుగు ఇల్లంద, నర్సంపేట, భద్రాచలం, పినపాక, నియోజకవర్గాలు వస్తాయి ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుండగా, బీజేపీ రాబట్టుకునే ఓట్లు ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా..? అన్నది మరి కొద్ది రోజులు ఆగితే గాని తెలియదు.

Exit mobile version