Site icon Swatantra Tv

గుండెపోటుతో యువత చనిపోతుంది.. ఇందుకేనా?

Heart Strokes

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గుండెపోటు(Heart Strokes)తో మరణించే వారు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనీలో సాయి ప్రభు(25) అనే యువకుడు జిమ్ లో కసరత్తులు చేసి బయటకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో యువకుడి కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. మే 3వ తేదీన తమ కుమారుడి వివాహం పెట్టుకున్నామని.. ఈలోపే ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

మరోవైపు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో క్రికెట్ ఆడుతూ 34 సంవత్సరాల జీఎస్టీ(GST) ఉద్యోగి వసంత్ రాథోడ్ గుండెపోటుతో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. గమనించిన మిగతా ఆటగాళ్లు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. వారం రోజుల ముందు కూడా రాజ్ కోటలో ప్రశాంత్ బరోలియా(27), సూరత్ లో జిగ్నేష్ చౌహాన్(31)లు కూడా క్రికెట్ ఆడుతూనే గుండెపోటుతో మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్ధంపడుతోంది.

కరోనా వ్యాక్సిన్(CORONA VACCINE) దుష్ప్రభావాల వల్లనే యువత ఇలా చిన్నవయసులోనే గుండెపోటు(Heart Strokes)కు గురవుతూ మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెడార్-ష్మిత్ సినాయ్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ (POTS) అభివృద్ధి చెందుతుందని తమ పరిశోధనలో వెల్లడించారు.

Read Also: మనుషులే కాదు రోబోలను కూడా వదలని గూగుల్
Exit mobile version