Site icon Swatantra Tv

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తవ్వేకొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నా యి. ఇజ్రాయెల్‌ నుంచి పరికరాలను తెప్పించి ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయడం సంచలనం సృష్టించింది. దీని వెనుక SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉండటం కలకలం రేపింది. వీరంతా కలిసి రాజకీయ నేతలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ప్రముఖులను బెదిరించి డబ్బులు దోచుకున్నట్లు కూడా తెలిసింది. మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ,..ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు నిందితుల తరపున లాయర్లు సమయం కోరారు. ఇవాళ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు.

 

Exit mobile version