Site icon Swatantra Tv

గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం హార్లీస్ 3,000 కిలోల తేనె కేక్ తయారీకి సిద్ధం

అనేక రకాల వరల్డ్‌ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసిన నగరం మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్‌ ఇండియా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా శుక్రవారం ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్‌ మెడోవిక్‌ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్‌ నాయక్‌ తెలిపారు.

హార్లీస్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్లేలా, స్వచ్ఛమైన తేనెతో తయారయ్యే దీని బరువు 3,000 కిలోలు కాగా 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు… ఉండే భారీ కేక్‌. ఈ విషయంలో గతంలో స్పిన్నీస్‌ దుబాయ్‌ సృష్టించిన మునుపటి రికార్డు కన్నా 10 రెట్లు మిన్నగా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేందుకు , ఈ గొప్ప ప్రయత్నంగా ఆయన వివరించారు.

Exit mobile version